మన్యం న్యూస్ ,నూగురు వెంకటాపురం:
మండల పరిధి సీతారాంపురం గ్రామంలో డాక్టర్ భవ్యశ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు.వంద మందికి పైగా మెడికల్ కిట్లు అందజేశారు. సీజనల్ వ్యాధుల గురించి ప్రతి ఒక్కరికి వివరించారు. పరిసరాలు ఎలా ఉంచుకోవాలో , ఊరు ప్రజలకి తెలిపారు. అంతేకాకుండా ఇప్పుడున్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా దోమ కాటు వల్ల మలేరియా బారిన పడకుండా ఆరోగ్యం వంతులుగా ఉంటారని ఆమె తెలిపారు. ఏజెన్సీలో దోమలు అధికంగా వ్యాధులను వ్యాప్తి పరిచేలా చేస్తాయని, పట్నాల దోమల కంటే ఏజెన్సీ లో ఉన్న దోమలు రెండు రకాల మలేరియా జబ్బులను ఉత్పత్తి చేస్తాయని, వాటి బారిన పడకుండా ఉండడానికి చుట్టూ ఉన్న కాలువలు శుభ్రంగా ఉంచు కోవడమే కాకుండా దోమతెరలు వాడాలని, సూచించారు, మెడికల్ కిట్ లో ఇచ్చిన మందులు ఎలా వాడాలో గ్రామ ప్రజలకు తెలిపారు. , నీటి నిల్వలు ఉంచకుండా జాగ్రత్త పడాలని, నీటి నిలువ ఉండడం తోటే లేనిపోని జబ్బులు వస్తాయని ప్రతి ఒక్కరూ ఈ విషయాల పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో డాక్టర్ భవ్య శ్రీ గారు, ఆరోగ్య సూపర్వైజర్ లక్ష్మి , డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు, కాఫీ డైరెక్టర్ లూర్ది రాజు, మండల కోఆర్డినేటర్ హనుమంత్, వాజేడు మండల కోఆర్డినేటర్ కామేష్, వెంకటాపురం రెండు మండలాల స్టాఫ్, ప్రశాంత్, నరేష్ ,ఇందిరా, పద్మ ,ఉష ,రమాదేవి ,భాస్కర్, ప్రసాద్ , సుజల పాల్గొన్నారు.
