మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలైన కుర్ణపల్లీ, ఎర్రబోరు, బత్తినపల్లి, చెన్నపురం బూరుగుపాడు, ఎర్రంపాడు, తిప్పాపురం, కందిపాడు మొదలు గ్రామాలు ఆదివాసులు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంకు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలంటూ తాసిల్దార్ రంగు రమేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసులు మాట్లాడుతూ తమ పిల్లల పై చదువుల నిమిత్తం కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరమయ్యాయినీ, తమకు ఈ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడంలో అధికారులు జాప్యం చూపుతూ వలస ఆదివాసులు అంటూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి పథకాలు అమలవుతున్న ఆదివాసీలకు ఇప్పటికీ పేదరికంతో నిరక్షరాస్యతతో సతమతమవుతురని ప్రభుత్వ పథకాలు వీరి జీవన ప్రయాణాలను మెరుగుపరచడంలో విఫలమయ్యాయని తినటానికి తిండి లేక కట్టుకోవటానికి సరైన దుస్తులు లేక దుర్భర జీవితం సాగిస్తున్న ఆదివాసీలు మేము అంటూ ఆదివాసుల్లో 90 శాతం అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు పై చదువుల నిమిత్తం తమకు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని పిల్లల భవిష్యత్తుని పరిగణలోకి తీసుకోవాలని ఉన్నత చదువులు చదువుకోవడానికి సహకరించాలని అధికారులను వేడుకోవడం జరిగింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ పిల్లల చదువులకై అవసరమయ్యే కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని ఆదివాసి గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.