మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 20, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ, బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలో భారీ సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు, బిఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ తదితర పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులతో పాటు చంద్రబాబు నాయుడు అభిమానులు పార్టీలకతీతంగా భారీ సంఖ్యలో నిరసన ర్యాలీ లో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అరేం రామయ్య, రోకటి రంగారావు, తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు తో పాటు బిఆర్ఎస్ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, ఎంపీపీ సోనీ, జడ్పిటిసి కళావతి, పొన్నెకంటి సతీష్ కుమార్, కొమ్మినేని పాండురంగారావు, పీజీ కృష్ణమూర్తి, దుద్దుకూరి సుమంత్, కాజా రమేష్, చావా వెంకటరామారావు, చిట్టి బాబు, కాంగ్రెస్ నాయకులు మంగీలాల్ నాయక్, నున్న కృష్ణయ్య, సిపిఐ నాయకులు చండ్ర నరేంద్ర కుమార్, గుండె పిన్ని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.