మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు మండలం బొజ్జయిగూడెం అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి దారుణహత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తి బొజ్జయిగూడెం గ్రామానికి చెందిన మారుతి శ్రీనుగా (45) గుర్తించారు. విషయం తెలుసుకున్న ఇల్లందు పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమగ్ర విచారణ జరిపి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఇల్లందు సీఐ కరుణాకర్ తెలిపారు.
