UPDATES  

 10వ రోజుకు చేరిన అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె

  • 10వ రోజుకు చేరిన అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె
  • సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె విరమించేది లేదంటున్న అంగన్వాడీలు
  • ఎమ్మెల్యే మెచ్చాను కలిసి వినతి పత్రం అందజేత

వివిధ రాజకీయ పక్షాల మద్దతు

మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 20: అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26,000 చెల్లించాలని గ్రాడ్యుటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు ఇతర సమస్యలు పరిష్కరించాలని అశ్వారావుపేట రింగ్ రోడ్డు లో అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నా కనీసం స్పందించడం లేదని, సమ్మెను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని అంగన్వాడీ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి ఉద్యోగుల సంఘం నాయకులు రాధా, కృష్ణవేణి లు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ అనేక కష్టనష్టాలకోర్చి విధులు నిర్వహిస్తున్న అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలనివారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేత

తమ సమస్యల పరిష్కారం కోసం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల అంగన్వాడీ ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు స్వగ్రామమైన తాటి సుబ్బన్న గూడెంలో ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని, అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సమ్మెను పరిష్కరించాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావును కోరారు. దీనిపై ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పందిస్తూ అంగన్వాడి ఉద్యోగుల సమ్మెను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

వివిధ రాజకీయ పక్షాల మద్దతు

అశ్వారావుపేటలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవదిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ, జూపల్లి రమేష్, తాటి వెంకటేశ్వర్లు, జేష్ట సత్యనారాయణ చౌదరి, సుంకవల్లి వీరభద్రం, సిపిఎం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, పిట్టల అర్జున్, ఎమ్మార్పీఎస్ నాయకులు కోలేటి ఫకీరయ్య, కొలికపోగు వెంకటేశ్వరరావు, బిజెపి నాయకులు, సిపిఐ నాయకులు తమ మద్దతును తెలియజేస్తూ అంగన్వాడి ఉద్యోగులకు అండగా ఉన్నామని తమ మద్దతు తెలియజేశారు. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, గ్రాడ్యుటి అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడి టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు చెల్లించాలని, ఎస్ఎస్సి అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని, మినీ అంగన్వాడి సెంటర్లను ను మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని, అంగన్వాడీ టీచర్లకు 1500, హెల్పర్లకు 750, మినీ వర్కర్లకు 1250 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్ తో సహా చెల్లించాలని, మూడు సంవత్సరాల రేషన్ షాప్ రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలని, ఇతర అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక సమ్మెలో అంగన్వాడి ఉద్యోగులు రాజేశ్వరి ఉష విజయ, నాగలక్ష్మి, భాగ్యలక్ష్మి, ఆర్కేఎం లక్ష్మి, వాణి, ప్రవీణ, వెంకటరమణ, కుమారి, ప్రభావతి, లక్ష్మీ, సరోజినీ, అంబుజ్జి, సావిత్రి, వేదవతి, రాణి, ఆదిలక్ష్మి, ఉష, లక్ష్మి, కుమారి, నర్సమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !