- పల్లెల అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్:విప్ రేగా
- కాంతారావు రామచంద్రపురం, మల్లెలమడుగు
- గ్రామపంచాయతీలలో విస్తృత పర్యటన కోటి 50లక్షల రూపాయల నూతన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్ , అశ్వాపురం:అశ్వాపురం మండలం పర్యటనలో భాగంగా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో భాగంగా రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో 9 నూతన సీ సీ రోడ్లను,మల్లెలమడుగు గ్రామపంచాయతీ పరిధిలో 15 సీసీ రోడ్లను మొత్తం 1 కోటి 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రహదారుల ను పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని,ప్రతి గడపకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకం అందుతుందని వారు తెలియజేశారు.గతంలో హమి ఇచ్చిన ప్రకారం రామచంద్రపురం గ్రామంలో నూరు శాతం సిసి రోడ్లను పూర్తి చేయిస్తానని చెప్పడం జరిగిందని,ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడం జరిగిందని తెలియజేశారు.అదేవిధంగా శివలింగాపురం గ్రామంలో పర్యటించినప్పుడు అక్కడ నీటి సమస్య ఉందని స్థానిక ప్రజలు చెప్పడంతో త్రీపిఎస్ బోర్ వేపిస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా ఎన్నో ఏళ్ల నాటికల గిరిజనులకు బోడు భూమి పట్టాల పంపిణీ కేసీఆర్ తోనే సాధ్యమైందని గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,నెల్లిపాక బంజారా సర్పంచ్ వెంకటరమణ,మల్లెమడుగు సర్పంచ్ కృష్ణవేణి ,మొండికుంట సర్పంచ్ మల్లారెడ్డి,ఉప సర్పంచ్ సుధీర్,ఎంపీటీసీ గాదె జయ,తుమ్మలచెరువు ఎంపీటీసీ తాటి పూజిత ,రామచంద్రపురం6 ఉపసర్పంచ్ టేకుల సురేష్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,బొక్క సాంబశివరెడ్డి ,మొగిల్లా వీరారెడ్డి,మిట్టకంటి సురేందర్ రెడ్డి,బొక్క శ్రీకాంత్,సూదిరెడ్డి గోపి రెడ్డి,గజ్జల లక్ష్మారెడ్డి,ఎక్స్ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,దైదా నారాయణరెడ్డి, సత్యనారాయణ,వల్లపు కృష్ణ ,కావటి ప్రసాద్,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్ కే యాకూబ్ ,ఉపాధ్యక్షులు రాజ్ కుమార్,యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,జూపల్లి కిరణ్,గుగులోతు రవి,జక్కుల సందీప్,సాయి,సందీప్,రాంబాబు,సాదిక్ పాషా,భాష,నాగేశ్వరరావు,బిఆర్ఎస్ నాయకులు,రామకృష్ణ పుల్లారావు హుస్సేన్ నాగేశ్వరరావు యువజన నాయకులు,కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు తదితర నాయకులు,పాల్గొన్నారు.