మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తమ సమస్యలను పరిష్కరించాలని గత కొద్ది రోజులుగా పాల్వంచ పరిధిలో ఉన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పట్టించుకోని కారణంగా బుధవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటిని ఏఐటీయూసీ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ముట్టడించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడి టీచర్ల వద్దకు ఎమ్మెల్యే వచ్చి రెండు మూడు రోజుల్లో సమస్యను మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మె పై ప్రభుత్వ దమనకాండ సరైనది కాదని సీఎం కెసిఆర్ జోక్యం చేసుకుని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీఐటీయూ జిల్లా బాధ్యులు గోనె మణి, విజయ, పద్మ, భారతి, మాదవి, రూప, సునీత, రాజ్యలక్ష్మి , సిపిఐ మండల కార్యదర్శి పూర్ణ చంద్రరావు, యూసుఫ్, సిపిఎం మండల కార్యదర్శి దొడ్డ రవి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.