UPDATES  

 మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి మద్దతుగా అశ్వారావుపేటలో భారీ ర్యాలీ

 

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి, చంద్రబాబు అభిమానులు

మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 20: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు భారీ ర్యాలీ బుధవారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన ఈ నిరసన ర్యాలీ కు కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ పాత ఎంపీడీవో ఆఫీస్ వద్ద నుండి రింగ్ రోడ్డు బస్టాండ్ మీదుగా వెంకట దుర్గా థియేటరు వరకు కొనసాగి, జంగారెడ్డిగూడెం రోడ్డు, ఖమ్మం రోడ్డు వరకు చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలనే నినాదాలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, సుంకవల్లి వీరభద్రరావు, కట్రం స్వామి దొర, రామకృష్ణ, అంజిబాబు, కరుటూరి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు డేగల రాము, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !