కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి సీసీరోడ్లు మంజూరు గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా టేకులపల్లి రామాలయం టెంపుల్ నందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు ప్రత్యేకపూజలు చేయటం జరిగింది.
అనంతరం టేకులపల్లి మండలంలోని 9వ మైలు గ్రామపంచాయతీలో 9వ మైలు ఆర్ అండ్ బీ రోడ్డు నుండి కోటల్ల వరకు డీఎంఎఫ్టీ నిధుల నుంచి 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బీటిరోడ్డు నిర్మాణపనులకు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ శంకుస్థాపన చేసారు. అదేవిధంగా గ్రామపంచాయతీలోని డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సిసిరోడ్లను సైతం ప్రారంభించారు. 9వ మైలు గ్రామపంచాయతీలో 15లక్షల రూపాయల అంచనా వ్యయంతో అంతర్గత సీసీరోడ్డు నిర్మాణపనులకు శంకుస్థాపన చేయటం జరిగింది. మండల పరిధిలోని మద్రాస్ తండా గ్రామపంచాయతీలోని డీఎంఎఫ్టీ నిధుల నుంచి 1కోటి రూపాయల అంచనా వ్యయంతో రావులపాలెం నుంచి మద్రాస్ తండావరకు బీటీరోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ శంకుస్థాపన చేసి, మద్రాస్ తండా గ్రామంలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అంతర్గత సిసిరోడ్డును ప్రారంభించారు. అదేవిధంగా కొత్తతండా గ్రామపంచాయతీ మాలపల్లి గ్రామంలో డీఎంఎఫ్టీ నిధుల నుంచి 29 లక్షల రూపాయల అంచనావ్యయంతో నిర్మించిన అంతర్గత సిసిరోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలప్రజలు ఎమ్మెల్యే హరిప్రియకు శాలువాతో సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తపరచటం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ..టేకులపల్లి మండలంలో కేసీఆర్ ఆశీస్సులతో నేడు 4.5 కోట్ల రూపాయల వ్యయంతో సీసీరోడ్లు, బిటిరోడ్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఘనంగా చేసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని, గ్రామాల అభివృద్దే ధ్యేయంగా అధికనిధులు విడుదల చేసి గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గ్రామాల్లో చేపట్టిన పల్లెపకృతి వనం, డంపింగ్ యార్డ్, రైతువేదికల వల్ల గ్రామాలు సుందరంగా మారాయని, ఇల్లందు నియోజకవర్గంలో గ్రామాలలో నూరుశాతం సిసి, బిటిరోడ్లు పూర్తయయ్యాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఎంపీపీ భూక్యరాధా, ఇల్లందు మండల జడ్పిటిసి ఉమాదేవి, టేకులపల్లి పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి బోడబాలునాయక్, మండల అధికార ప్రతినిధి బానోత్ కిషన్ నాయక్, రైతుబందు సమితి అధ్యక్షులు లక్కినేని శ్యామ్, ఎంపీటీసీ జాలాది అప్పారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.