అభివృద్ధి ప్రదాత రేగా కాంతారావుకు అడుగడుగునా జన నీరాజనం
మంగళ హారతులు,పూలుతో ఎమ్మెల్యే రేగాకు స్వాగతం పలికిన ఆడపడుచులు
రేగా పర్యటన విజయవంతం తో జోష్ లో మండల బీ అర్ ఎస్ జోష్
మన్యం న్యూస్,అశ్వాపురం: పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, జననేత,విప్, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావుకు బుధవారం మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు.బుధవారం మండలంలో ఎమ్మెల్యే రేగా విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆడపడుచులు పూలు జల్లుతూ, మంగళ హారతులతో తమ అభిమాన నాయకుడు, అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే రేగా కు ఘన స్వాగతం పలికారు.ఒక వైపు వివిధ పార్టీల నుండి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరికలు, ప్రజల నుండి లభిస్తున్న అపూర్వమైన మద్దతుతో అశ్వాపురం మండల బీఆర్ఎస్ పార్టీలో జోష్ డబుల్ అయింది. రేగ పర్యటన విజయవంతం పట్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.
