మన్యం న్యూస్ దుమ్మగూడెం సెప్టెంబర్ 21::
మండలంలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యం సీతానగరం గ్రామం నుండి లక్ష్మీనగరం వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదరావు మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకున్న రాజకీయ కక్షతోనే అక్రమ అరెస్టు చేశారని,ఇలాంటి చర్యలతో చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ తగ్గించలేరన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపి పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కెల్లా వేణు, మట్ట వీరయ్య, కామరాజు, దుర్గారావు, వంశి, జనసేన పార్టీ నాయకులు ప్రకాష్, గుణవంతు, సాయిరాం, సాయి చందు, అభిరామ్, తదితరులు పాల్గొన్నారు.