మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గుండాల మండలంలోని పలు కుటుంబాలను గురువారం పరామర్శించారు. శెట్టిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి పెద్దమ్మ సూర్యా దేవి మరణించడంతో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గుండాల మండల కేంద్రంలో పాత్రికేయుడు తవిడిశెట్టి నాగరాజు తల్లి రాజ్యలక్ష్మి దశదినకర్మకు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. గుండాల మండల పంచాయతీ కార్యాలయంలో వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న ఈసం గోపయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గుండాల మండలం పార్టీ నాయకులు ఇల్లందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్తి లింగయ్య అనారోగ్యంతో ఉండటంతో మామ కన్ను గ్రామంలో గల అతని నివాసానికి వెళ్లి లింగయ్యను పరామర్శించారు. కాంచనపల్లి గ్రామంలో యువజన నాయకుడు శేఖర్ అనారోగ్యంతో బాధపడటంతో అతని స్వగృహం కి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధ
