ఇంటింటికి,గడపగడపకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ.
మన్యం న్యూస్ కరకగూడెం: పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల పరిధిలోని అనంతారం, ముత్తారం గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, గ్రామాలలో పట్టణాలలో చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవసారి ముచ్చటగా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం,పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు మూడోసారి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం తమ వంతుగా అహర్నిశలు కష్టపడి ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. అలాగే ఆయన సూచనల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో గడపగడపకు ఇంటింటికి బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పినపాక నియోజకవర్గం అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని తెలపడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగా.సత్యనారాయణ, పసునూరి.అంజయ్య, బత్తిని.సీతయ్య,అత్తడ.ముకుంద, తదితరులు పాల్గొన్నారు.
