గుండాలను అభివృద్ధి చేసిన ఘనత నాదే
*కొత్త బిచ్చగాళ్ళతో జాగ్రత్త
గుండాల,ఆళ్లపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనలను చేసిన ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నారు. గుండాలను అభివృద్ధి చేసిన ఘనత తనదేనని, కొత్త బిచ్చగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. గురువారం గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పర్యటించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శంకుస్థాపనలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.శెట్టిపల్లి గ్రామంలో కోటి ఐదు లక్షల రూపాయలతో చెట్టుపల్లి నుండి గుంపు వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కన్నాయిగూడెం గ్రామానికి 45 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం పది లక్షల రూపాయల పనులకు ఆయన శంకుస్థాపనను చేశారు. కాచన పల్లి గ్రామం లో ఆర్ అండ్ బి రహదారి నుండి ఆశ్రమ పాఠశాల వరకు 70 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు పనులను ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అనంతరం కాచినపల్లి గ్రామంలో లక్షల రూపాయలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆళ్లపల్లి మండలం మర్కోడు పంచాయతీలో గల కిచ్చెనపల్లి గ్రామం నుండి, రాఘవాపురం వరకు వీటి రోడ్ రెండు కోట్ల 25 లక్షల రూపాయలతో చేపట్టిన పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతోగు నుండి ఆశ్రమ పాఠశాల వరకు 45 లక్షల రూపాయలతో నిర్మించబోయే బీటీ రోడ్డు పనులకు సైతం ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. మొత్తం అభివృద్ధి పనులతో గుండాల మండలాన్ని ప్రగతి పదంలో నిలుపుతున్నా అని రేగా అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ఫారువన్నారు.
