మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 21, కొత్తగూడెం డివిజన్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం ఉపాధ్యక్షులుగా మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో గల వశిష్ట విద్యా మందిర్ కరస్పాండెంట్ ఎనుముల శ్రీనివాసరావు ఎంపికయ్యారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని లిటిల్ బర్డ్స్ హైస్కూల్లో జిల్లా అధ్యక్షులు బండి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు భాగం విజయకుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాలల యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్వహణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించడం జరిగింది. అనంతరం కొత్తగూడెం డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. డివిజన్ కమిటీ అధ్యక్షులుగా ఎం వెంకన్న, (చుంచుపల్లి) ప్రధాన కార్యదర్శిగా కె జవహర్ జో, (గొల్లగూడెం) కోశాధికారిగా పి రమేష్, (కొత్తగూడెం) ఉపాధ్యక్షులుగా ఈ శ్రీనివాసరావు, (నర్సాపురం) ఎస్.కె అబ్దుల్ బాసన్త్ (రామవరం) తో పాటు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా బాధ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.