సిపిఎం పార్టీ మండల కార్యదర్శి .కుమ్మరి శ్రీను .డిమాండ్
మన్యం న్యూస్ నూగూర్ వెంకటాపురం.
ఈరోజు వెంకటాపురం మండల కేంద్రంలో అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను సందర్శించారు .వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
అంగన్వాడీలు గ్రామాల్లో చిన్నపిల్లలకు విద్యా,బుద్ధులు నేర్పుతూ వారి ఆలనా ,పాలన చూస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజలలో తీసుకెళ్తూ వాటిని అమలు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అన్నారు .అంతేకాకుండా గత 48 సంవత్సరాల నుంచి గ్రామాలలో చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో చేదోడు,వాదోడుగా ఉంటూ సేవలు చేస్తున్నారని అన్నారు. అంగన్వాడీల సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించి ,వీరికి కనీస వే తన చట్టం ప్రకారం 26వేల రూపాయలు ఇవ్వాలని ,వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పీ.ఎఫ్ ,ఇ.ఎస్.ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ నాయకులతో చర్చలు జరిపి వీరి సమస్యలపై సానుకూలంగా స్పందన ఇవ్వాలని డిమాండ్ చేశారు . వీరి సమస్యల్ని పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. అంగన్వాడీలకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని వీరు చేసే సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. .ఈ సమావేశంలో సిఐటి మండల కార్యదర్శి కట్ల నరసింహాచారి ,గిరిజన సంఘం మండల కార్యదర్శి ఇరుప. శ్రీను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుండమల్ల.ప్రసాదు అంగన్వాడి నాయకులు మీనా కుమారి.అరుణ కుమారి ,బి. నాగవీర వెంకట కృష్ణకుమారి, సడాలు ,భిక్షావతి ,సరిత, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు
