UPDATES  

 సిఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీలు మానవహారం…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ, సెప్టెంబర్ 21 : మండల కేంద్రంలో సిఐటియుసి మండల కార్యదర్శి బొర్రా కేశవులు ఆధ్వర్యంలో గురువారం మండల ప్రధాన సెంటర్లో అంగనవాడి టీచర్లు,ఆయాలు, సమస్యలపై మానవహారం నిర్వహించారు. అనంతరం జెడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డికి సమస్యలతో కూడిన వినతిని సమర్పించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పల్లెలలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు శైశవదశ పిల్లలనుండి బాల్య దశ వరకు, పిల్లల పెరుగుదలలో, సంపూర్ణ ఆరోగ్య దశ ఉండేలా ఎంతో కష్టపడుతున్నారని, వారిని ప్రభుత్వం గుర్తించి, ప్రభుత్వ ఉద్యోగులగా, కనీస వేతనం 26 వేల రూపాయలు ఉండేలా, రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వం తరఫున బెనిఫిట్స్ వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు వినోద, అరుణ,భూషమ్మ, సరోజ, అనిత భారతక్క, శోభ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !