మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 21::
మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామంలో దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 58 మంది సాధారణ వ్యాధులు అలానే జ్వరం ఉన్నటువంటి 7 మంది రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సాగర్, సర్పంచ్ కృష్ణవేణి, హెల్త్ అసిస్టెంట్ గంగాధర్ గౌడ్, ఏఎన్ఎం అనిత, సెక్రటరీ రవి, ఆశ రమణ, తదితరులు పాల్గొన్నారు.