మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు నందుగల రామకృష్ణ సామిల్ మిల్ నందు ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద గురువారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ముఖ్యఅతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి రాష్ట్రనాయకులు పులిగళ్ళ మాధవరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్, 19వ వార్డు కౌన్సిలర్ పత్తి స్వప్న, నాయకులు భద్రం, మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, నందకిషోర్, రావూరి సతీష్, పత్తి రంజిత్, సరస్వతి, సునిత తదితరులు పాల్గొన్నారు.