మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 21::
మండలంలోని పలు ప్రధాన కూడలిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఆదివాసి గిరిజన సంఘాల పేరిట పోస్టర్లను వేశారు. మావోయిస్టు పార్టీకి వారోత్సవాలను ఆదివాసి గిరిజనులు ఎందుకు జరుపుకోవాలని వారు ప్రశ్నించారు. గిరిజనులకు ఉపయోగపడని మావోయిస్టు వారోత్సవాలు వద్దు అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ నెపంతో చంపుతున్నారంటూ, రోడ్లు రాకుండా చేసి అభివృద్ధికి దూరంగా మమ్మల్ని బతకమన్నారంటూ నిలదీశారు. ఇకనైనా మా ఆదివాసుల బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వండి మమ్మల్ని ఎదగనివ్వండి అంటూ పోస్టర్లు తెలిపారు.