* ఆకర్షణగా నిలిచిన అలంకరణ
* మురిసిన భక్తజనం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
వినాయక నవరాత్రి ఉత్సవాలు గత కొద్ది రోజులుగా విజయవంతంగా నడుస్తున్నాయి. ఉత్సవాలలో భాగంగా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్ ఏరియాలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన నాయకుడికి శనివారం కోటి రూపాయలతో అలంకరణ చేశారు. కోటితో అలంకరణ చేసిన వినాయక మండపాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి మురిసిపోయారు.