పినపాక బీ. ఆర్ ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు భారీ మెజారిటీతో గెలవాలి
* యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి 101 కొబ్బరికాయలను కొట్టిన రేగా వీరాభిమాని పాయం మౌనిక వర్మ
మన్యం న్యూస్,మణుగూరు:పినపాక నియోజకవర్గ బి ఆర్ ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలని రేగా కాంతరావు వీర అభిమాని, రేగ సోషల్ మీడియా వారియర్ పాయం మౌనిక వర్మ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న ఆమె 101 కొబ్బరికాయలు కొట్టి రేగా గెలుపు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాయం మౌనిక వర్మ మన్యం న్యూస్ తో మాట్లాడుతూ…
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పినపాక నియోజకవర్గం అభివృద్ధికి, మారుమూల గ్రామాలకు సైతం రహదారులు వంతేలను నిర్మిస్తు అభివృద్ధి కి ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న కృషి ఎంతో గొప్పది అన్నారు .ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాల ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందజేయుటకు ప్రభుత్వ దావాఖానాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారని, ఎవరైనా ఆపదలో ఉన్న వ్యక్తులు అన్నా అని తలిస్తే తాను స్థాపించిన రేగా విష్ణు మెమోరియల్ ట్రస్టు ద్వారా నిరుపేదలకు, అనారోగ్యంతో ఉన్నవారికి, చదువుకునే ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఎందరికో ఆర్థిక సహాయం అందజేస్తున్న గొప్ప వ్యక్తి రేగా కాంతారావు అన్నారు. ముఖ్యంగా ఎన్నో ఏండ్ల గిరిజనుల పోడు భూముల కలలను సిద్ధింపచేసిన నిత్య కృషివలుడు , మంచి మనసున్న మనిషి పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తెలంగాణ ప్రభుత్వ విప్ టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగా కాంతారావు ఆ లక్ష్మి నరసింహ స్వామి ఆశీర్వాదంతో ముచ్చటగా మూడవసారి గెలుపొంది పినపాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పాయం మౌనిక వర్మ తెలిపారు.