మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 23, మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు అదే గ్రామానికి చెందిన వాసినేని పిచ్చయ్య, వెంకటేశ్వర్లు జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ రావు, నాగరాజులు సుమారు 12 వేల రూపాయల విలువగల ఆరు విజిటర్స్ చైర్స్ ను శనివారం పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు చేతనైన చిరు సహాయాన్ని మన పాఠశాలకు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. వృత్తిరీత్యా గ్రామానికి దూరమైనప్పటికీ జన్మభూమి మీద ఉన్న మమకారం, బాల్యంలో విద్య బుద్ధులు నేర్చుకున్న పాఠశాలను గుర్తుంచుకొని అవసరమైన ఫర్నిచర్ ను అందించిన వారికి, వారి కుటుంబ సభ్యులకు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందితోపాటు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోగుల సంజీవరావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కృష్ణారావు, ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, కాజా మియా, మిరియాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.