మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
మహిళలు ఆదిపరాశక్తులని మహిళలు లేనిదే మానవుడికి మనుగడలేదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ 35వ వార్డులో దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కార్యాలయాన్ని ఆదివారం వనమా ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడడం జరిగింది. మహిళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా రాంబాబు, కౌన్సిలర్లు రుక్మేందర్ బండారి, అంబుల వేణు, కోలాపురి ధర్మరాజు, బిఆర్ఎస్ నాయకులు రజాక్, మధుసూదన్ రావు, జానీ, రజనీకాంత్, కాళీ, నాగేందర్, గడ్డం వెంకటేశ్వర్లు, నరసింహారావు, మల్లెల ఉషారాణి, మునిలా, కర్రీ అపర్ణ, దిశా కమిటీ నిర్వాహకురాలు వాసర్ల నాగమణి, రాష్ట్ర కార్యదర్శి సీతాకుమారి, జిల్లా అధ్యక్షులు అన్నపూర్ణ, దిశా జిల్లా కమిటీ సభ్యులు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.