UPDATES  

 2.17కోట్లతో టేకులపల్లి మండలంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన,

2.17కోట్లతో టేకులపల్లి మండలంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే హరిప్రియ ఇల్లందు నియోజకవర్గ అభివృద్దే నా ధ్యేయం ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మన్యం న్యూస్,ఇల్లందు:బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేడు ప్రతిపల్లే సీసీరోడ్లతో కళకళలాడుతున్నాయని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ అన్నారు. టేకులపల్లి మండలంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ సీసీరోడ్లకు, గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. టేకులపల్లి మండల పరిధిలోని వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేకపూజలు చేయటం జరిగింది.
అనంతరం టేకులపల్లి, బద్దుతండ, ఎర్రాయిగూడెం, మొక్కంపాడు, కిష్టారం, లచ్చగూడెం, గంగారం, చింతోనిచిలుక, ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామపంచాయతీలలో సిసిరోడ్లు ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా నూతన గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ..2 కోట్ల17లక్షల 50వేల రూపాయల డీఎంఎఫ్టీ, ఈజీఎస్, ఎస్డిటీ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయటం ఆనందంగా ఉందన్నారు. ఇల్లందు నియోజకవర్గాన్ని గత పాలకులు పూర్తిగా విస్మరించారని కానీ నేడు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు రాష్ట్రంలోని ప్రతీపల్లెలు అభివృద్ది చెందాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమని పారిశ్రామికంగా ఇల్లందు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి బోడబాలునాయక్, సర్పంచులు ఈసం హనుమంతు, అచ్చయ్య, విజయలక్ష్మి, పాయం సమ్మయ్య, మాలోత్ సురేందర్ నాయక్, ఈసం నీలమయ్య, ఎంపీటీసీలు, జాలాది అప్పారావు, బట్టు శివ, జిల్లా నాయకులు బానోత్ రామానాయక్, కంబంపాటి చంద్రశేఖర్, మండల అధికార ప్రతినిధి బానోత్ కిషన్ నాయక్, రైతుబందు సమితి అధ్యక్షులు లక్కినేని శ్యామ్, మండల ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !