అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది
*సర్వ మాత సారాంశం ఒక్కటే
*గణపతి దేవుని పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై షాహిన
మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి సెప్టెంబర్ 24: అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది అనిఎస్సై షాహిన అన్నారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్ర పరిధిలోని రాజాపురం గ్రామంలోఎస్సీ కాలనీలోని గణపతి పూజ కార్యక్రమంలో ఎస్సై షాహిన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూసర్వ మాత సారాంశం ఒక్కటే అని, దేవుళ్ళ మతాలు ఒకటేనని, మత ప్రచారాలను నమ్మవొద్దని చెప్పారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గ్రామస్థులతో కలిసి తన చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వేముల వెంకటేశ్వరరావు,గొల్లపల్లి మహేష్,బల్లెపోగు శ్రీనాథ్,నారపోగు సాయి,సిరికొండ రవిచంద్ర,కాకాటి నాగేంద్రబాబు,గొల్లపల్లిరాంబాబు,బోల్లేపోగువెంకన్న,సీతారాములు,నారా బాబు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.