మన్యం న్యూస్ మణుగూరు:
అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం,ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీ ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకొని సోమవారం వినూత్న నిరసన తెలియజేశారు.గత 15 రోజులుగా రాష్ట్రవ్యాప్త పిలుపు లో భాగంగా మణుగూరు మండలంలో ఎంపీడీవో కార్యాలయం ముందు కళ్లకు గంతలతో సమ్మె నిర్వహించారు.అనంతరం గ్రామపంచాయతీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీ చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు.సమ్మె విజయవంతం కావాలని సమ్మె ఖర్చులకోసం గ్రామపంచాయతీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వెయ్యి రూపాయలు అందజేశారు.అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.గ్రామపంచాయతీ కార్మికుల నాయకులు ఎం.రంగా,దొడ్డి.శంకరయ్య,మణెమ్మ,సదానందం,వ్యవసాకారంగా సంఘం మండల కార్యదర్శి పిట్టల నాగమణి, అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్యామల,హేమలత,మల్లేశ్వరి,భారతి,విజయ,అరుణ,సావిత్రి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.