మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్,పోలీసు సిబ్బంది మణుగూరు మండల పరిధిలోని గ్రామాలలో,పట్టణ పరిధిలో మావోయిస్టు ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లను అతికించడం జరిగింది.ఈ వాల్ పోస్టర్ ద్వారా సంఘ విద్రోహ శక్తులను గ్రామాలలోనికి రానీయకుండా, వారికి సహకరించకుండా చర్యలు చేపట్టడం జరిగింది అన్నారు.అలాగే వారిపై ఉన్న రివార్డులను వారి ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ఆచూకీ తెలిసినవారు పోస్టర్ లో ఉన్న ఫోన్ నెంబర్లకు సమాచారం,అందించవలసిందిగా వారు కోరారు.అదేవిధంగా ఎవరైనా సంఘ విద్రోహ శక్తులకు సహకరించిన యెడల వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.