మన్యం న్యూస్, అశ్వాపురం:గ్రామాల్లోకి నక్సలైట్లు వస్తే సమాచారం అందించండి అని అశ్వాపురం ఎస్సైసురేష్ కుమార్ కోరారు. సోమవారం మండల పరిధిలోని ఆదివాసీ గ్రామాలను అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్న మావోయిస్టులను గ్రామాల్లోకి రాకుండా చూడాలని, ఒకవేళ నూతన వ్యక్తుల సంచారం ఉంటే అశ్వాపురం పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. పలువురునక్సల్స్ దళనేతల ఫొటోలతో కూడిన పోస్టర్లను అంటించారు.నక్సల్స్ గ్రామాల్లోకి వచ్చినా, అడవుల్లో తిరిగినా తమకు సమాచారం అందిస్తే నగదు బహుమతిని ఇస్తామని పోలీసులు ప్రకటించారు. నక్సలైట్లు ఆదివాసీల పల్లెలను అభివృద్ధి చెందకుండా అడ్డుకోవడంతో పాటు, రహదారులు, వంతెనలు నిర్మించే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. పేదల కోసం పని చేస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్న నక్సలైట్లు, గ్రామాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారని పోస్టర్లలో వివరించారు.