UPDATES  

 సమాచారం మాకు బహుమతి మీకు ఆళ్లపల్లి ఎస్సై రితీష్

మన్యం న్యూస్ గుండాల: మావోయిస్టు పార్టీ నాయకుల సమాచారం ఇవ్వండి …బహుమతి పొందండి అని ఆళ్లపల్లి ఎస్సై రితీష్ అన్నారు. సోమవారం మావోయిస్టు నాయకులతో పోస్టర్ను ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పోస్టర్ లోని నాయకుల సమాచారం ఇస్తే బహుమతి ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. మండలంలోని గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !