మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి (సెప్టెంబర్ 25): అన్నపురెడ్డిపల్లి మండలంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు కనిస వేతనాలు ఇవ్వాలని సోమవారం మండల కేంద్రంలో నిరవదిక సమ్మె చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను చిన్నచూపు చూస్తుందని,కనీస వేతనం 18000 వేలు ఇవ్వాలని,పీఏఎఫ్,ఇఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా 5లక్షలు,రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5లక్షలు,ఏఎన్ఎం, జీఎన్ఏం పోస్టులలో ఆశాలకు ప్రమోషన్ కల్పించాలని అలాగే హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించి తమ డిమాండ్లను అమలు చేయాలని కోరారు.లేకపోతే సమ్మెను మరింత ఉధృతంగా చేపడతామని హెచ్చరించారు.