మన్యం న్యూస్ గుండాల: ప్రజాపంథా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ చర్ల పోలీసులు అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని పార్టీ జిల్లా నాయకులు ఈసం శంకర్, గుండాల మండల కార్యదర్శి కొమరం శాంతయ్య, పి వై ఎల్ జిల్లా కార్యదర్శి అజయ్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 25వ తారీఖున జరిగే ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం కోసం ప్రజలను కలిసి వస్తున్న తరుణంలో చర్ల పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. స్థానిక చోటామోటా నాయకుల హస్తం వల్లే అరెస్టు చేసినట్టు వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరైనది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సనప కుమార్, కోడూరి జగన్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.