శభాష్ డా.కృష్ణశ్రీ
మన్యం న్యూస్ ,మణుగూరు: అందుకే అంటారేమో వైద్యో నారాయణో హరిః. ఆ వైద్యురాలు ఒక వైపు జ్వరంతో బాధపడుతుంది ప్రజా ఆరోగ్యమే ముఖ్యంగా భావించి సిలైన్ ఎక్కించుకుంటూనే రోగులకు వైద్య సేవలు అందించారు ప్రభుత్వ వైద్యురాలుకృష్ణశ్రీ.వివరాలు ఇలా ఉన్నాయి.
మణుగూరు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య సేవలందిస్తున్న కృష్ణ శ్రీ
గత కొద్ది రోజులుగా విపరీతమైన జ్వరం తో బాధపడుతూ ఉంది. అయినప్పటికీ వైద్య వృత్తి పరమావధిగావైద్యం నిమిత్తం సుదూర ప్రాంతాల నుండి 100 పడకల ఆసుపత్రికి రోగులు తాకిడి ఎక్కువైంది.ఈ నేపథ్యంలో డాక్టర్ కృష్ణ శ్రీ తను పేషెంట్ అనే విషయం మరిచి వచ్చిన రోగులను పరీక్షిస్తూ వారికి వైద్య సేవలు అందించారు. డాక్టర్ కృష్ణ శ్రీ సేవలను మెచ్చుకుంటూ వంద పడకల ఆసుపత్రికి వచ్చిన రోగులు శభాష్ అంటూ ప్రశంసించారు.