మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు మళ్లీ ఆదరించండి రెట్టింపుగా పనిచేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.
మంగళవారం పాల్వంచ పట్టణంలో సుమారు 15 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సందర్భంగా వనమా మాట్లాడుతూ
పాల్వంచ కొత్తగూడెంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. గతంలో పాల్వంచలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. 1 లక్ష మందికి ఇల్లు కట్టించడం జరిగిందని తెలిపారు. ఎక్కడ చూసినా నా అభివృద్ధి శిలాఫలకాలు కనిపిస్తాయని చెప్పారు. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన అభివృద్ధి స్పష్టంగా కనబడుతుందన్నారు. కొత్తగూడెం అభివృద్ధిలో నాకు ఎవరు సాటి రారని పేర్కొన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు శాయశక్తుల పనిచేస్తున్నానని తెలిపారు. ప్రతి గడప గడపకు బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు పోతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే గోదావరి జలాలను అందిస్తానని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ఏ. స్వామి, డిఈ మురళి, ఏఈ రాజేష్, పబ్లిక్ హెల్త్ డి ఈ శ్రీనివాస్, పెద్దమ్మ గుడి చైర్మన్ మహిపతి రామలింగం, సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్ తదితరులు పాల్గొన్నారు.