UPDATES  

 *అంగన్వాడి ఉద్యోగులు, ఆశా వర్కర్ల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పాయం

మన్యం న్యూస్,పినపాక:
పినపాక మండల కేంద్రంలోని అంగన్వాడి టీచర్స్, హెల్పర్లు ,ఆశా వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మెక
కాంగ్రెస్ పార్టీ నాయకులు, పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కష్టాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు. అదేవిధంగా వారు కరోన కష్టకాలంలో వారు చేసిన సేవలు మరువలేనిది అని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్స్ కీలక పాత్ర పోషించారు అన్నారు అనంతరం అంగన్ వాడి టీచర్స్ కి ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం చేసారు.ప్రభుత్వం వారి న్యాయ సంబంధమైన డిమాండ్ పరిష్కరించాలన్నారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరం వెంకటేశ్వరరావు, కొమరం రాములు, కొడాలి కృష్ణ,నవ్వాతి శ్రీను, బండారి సాంబయ్య, గుదిబండి మధుసూదన్ రెడ్డి, పడాల రాము, మద్దెల సమ్మయ్య,అరె నవీన్,బూర రవి, అబ్దుల్ హమీద్, పోలిశెట్టి శ్రీను, సోడే కృష్ణ, తోలేం అర్జున్,పడిగా వీరబాబు,పండ రమేష్,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !