కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గం బూత్ కమిటీల సమీక్షా సమావేశం
ముఖ్య అతిథులు గా పాల్గొన్న పరమేశ్వర్ నాయక్,పోదెం వీరయ్య
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని హనుమాన్ ఫంక్షన్ హాల్ లోని పినపాక నియోజకవర్గం కో ఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన పినపాక నియోజకవర్గ బూత్ కమిటీల సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కర్ణాటక మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్,భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో గడప గడపకూ వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీలను ఇందిరమ్మ ఇండ్లు,యువ వికాసం,చేయూత,గృహ జ్యోతి,రైతు భరోసా,మహాలక్ష్మి పథకాలను ప్రజలకు వివరించి పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మాజీ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ముస్లీం మైనారిటీ జిల్లా అధ్యక్షులు మొహ్మద్ ఖాన్, డీసీసీడి డైరక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య,మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్,అశ్వపురం మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య,బూర్గంపాడు మహిళా మండల అధ్యక్షులు భూక్యా సుగుణ,యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోర్స ఆనంద్,మహిళా కాంగ్రెస్ బీ బ్లాక్ అధ్యక్షులు బర్ల నాగమణి,నియోజకవర్గ నాయకులు బట్టా విజయ్ గాంధీ,మహిళా నాయకులు పోలెబోయిన శ్రీవాణీ, మణుగూరు మండల వైస్ ఎంపీపీ కేవీ రావు,తదితరులు పాల్గోన్నారు.