మన్యం న్యూస్,మణుగూరు:
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆయన అనుచరులపై మాజీ ఎమ్మెల్యే పాయం ఆయన అనుచరులు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేయడంతో రేగా బహిరంగ చర్చకు సవాల్ విసిరిన విషయం విధితమే. కాగా ఎమ్మెల్యే రేగాకు సమాధానం చెప్పలేక పాయం వర్గం తోక ముడుచుకున్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో స్పందించారు.తన్నించుకోవడం అంటే ఇదేనేమో…ఎట్లా ఉంది రిటర్న్ గిఫ్ట్? అని కామెంట్ చేశారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ రేగా కాంతారావు దూకుడు పెంచారు. ఒకవైపు నిధుల వరద, మరోవైపు ప్రతి 100 ఓట్లకు ఒక ఇన్చార్జి నియామకం ఇలా రేగా దూకుడుతో ప్రతిపక్ష పార్టీలు విలవిలలాడుతున్నాయి.