మణుగూరు డ్రింకింగ్ వాటర్ స్కీం కు రూ.20 కోట్లు మంజూరు
జీ ఓ నెంబర్ 752 ద్వారా నిధులు
6 నెలల్లో మణుగూరు కు 24 గంటల త్రాగునీరు
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు
మన్యం న్యూస్,మణుగూరు: మణుగూరు పట్టణానికి 6 నెలల్లో 24 గంటలు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తానని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు వాటర్ స్కిన్ కి తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం జీవో నెంబర్752 ద్వారా నిధులు మంజూరు చేసిందని అసంపూర్తిగా ఉన్న తాగునీటి ప్రాజెక్టుకు ఈ నిధులు కేటాయించి పూర్తి చేస్తానని అన్నారు. ఈ నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి కేటీఆర్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.