UPDATES  

 సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. సుమారు రూ.700 కోట్లకుపైగా బోనస్ పంపిణీ

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఇటీవల సింగరేణి ఉద్యోగులు కార్మికులు ఏరియర్స్ డబ్బులు అందుకున్న విషయం తెలిసిందే. ఇది మరువకముందే మరో గుడ్ న్యూస్ వెలువడింది. సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాల్లో నుండి బోనస్ ఇచ్చేందుకు మంగళవారం ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. 2022 -23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాలలో నుండి 12 శాతం వాటా బోనస్ సింగరేణి అధికారులు ఉద్యోగులు కార్మికులు అందుకోనున్నారు. ఇందుకుగాను సుమారు రూ.700 కోట్లకుపైగా పంపిణీ కార్యక్రమాన్ని యాజమాన్యం చేపట్టనుంది. ఈ లాభాల బోనస్ ను దసరా పండుగకు ముందు పంపిణీ చేయనున్నట్లు సింగరేణిలోని ఒక అధికారి తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !