మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు ఇల్లందులపాడులో గల వినాయక మండపం వద్ద మంగళవారం ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ముఖ్యఅతిథిగా హాజరై కమిటీసభ్యులు ఏర్పాటుచేసిన ప్రత్యేకపూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ముద్రగడ వంశీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు శ్యామ్ తీవారి, దాసరి గోపాలకృష్ణ, ముక్కు శ్రీవెద్, గణేష్ కమిటీ సభ్యులు నాగరాజు, రఘు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.