మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- నలుగురు పట్టీ నేడితే గానీ కదలని ట్రాక్టర్ ను ఒక వ్యక్తి అవలీలగా లాగిన అరుదైన ఘనత ఇల్లందు మండలంలోనీ మశివాగు గ్రామానికి చెందిన కొడం కృష్ణ సాధించాడు. గ్రామంలో వాహనాల మెకానిక్ గా పనిచేస్తున్న కృష్ణ వేహికిల్ టైర్ ట్యూబ్ ల సహాయంతో ట్రాక్టర్ ను దేహానికి కట్టుకొని 600 మీటర్స్ పొడవు లాగి గ్రామస్థులందరినీ ఆశ్చర్య పరిచాడు. భవిష్యత్తులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కి ఎక్కడమే లక్ష్యంగా కృష్ణ చెప్తున్నాడు.