మన్యం న్యూస్, అశ్వరావుపేట, సెప్టెంబర్ 26: అశ్వారావుపేట మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీపీ శ్రీరాంమూర్తి లకు ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు మంగళవారం సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. బుధవారం నుండి సమ్మె ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు మనోహర్, వెంకట్రావ్, రాజేశ్వరి, నాగదేవి తదితరులు పాల్గొన్నారు.