మన్యం న్యూస్,దుమ్ముగూడెం:
గోదావరి వరద ముంపు నుండి ప్రజలను రక్షించడానికి కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం బుధవారం నిధులు మంజూరు చేస్తూ విడుదల చేసింది .భద్రాచలం , చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కరకట్టల నిర్మాణానికి 38.045 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా. తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ లు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.