మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గణనాథుడి చేతిలోని లడ్డు భారీ పలికింది. మండల కేంద్రంలోని రామాలయం వద్ద ఏర్పాటుచేసిన గణనాధుడి చేతిలోని లడ్డు రూ.8016 లకు కందుకూరి సంతోష్ సొంతం చేసుకున్నారు. సుభాష్ నగర్ ఏరియాలో ఏర్పాటుచేసిన వినాయకుడి చేతిలోని లడ్డు రూ. 17,116 పాలకుర్తి సోమయ్య సొంతం చేసుకున్నారు. గుండాల తండాలో ఏర్పాటుచేసిన గణనాథుడు చేతిలోని లడ్డు రూ.18,016 బానోత్ హీరు నాయక్ దక్కించుకున్నారు. అనంతరం సుభాష్ నగర్ ఉత్సవ కమిటీ సభ్యులు దాతలైన మోతి చిన్న స్వామి, కదిరి శ్రీనివాస్, ఆవుల శీనును శాలవలతో సన్మానించారు .ప్రతియేట లడ్డు వేలం పాట మండల కేంద్రంలో హోరాహోరీగా సాగుతుంది.