మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం బోజ్జాయిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోజ్జాయిగూడెం పంచాయితీ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్న షర్మిల బుధవారం రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా స్కూటీ పై గ్రామ పంచాయితీ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న కారు డి కొట్టింది. దాంతో బాధితురాలి కాలు చెయి విరిగిపోయాయి. ప్రమాదానికి గురైన రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.రోడ్డు ప్రమాదం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిన షర్మిల సమాచారం స్థానికులు మండల ఎంపిడిఓ అధికారికి అందించగా వారు హుటాహుటిన షర్మిలను ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసహాయం అందిస్తుండగా పరిస్థితి సీరియస్ గా ఉండటంతో అత్యవసర వైద్యసహాయం నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్స్ తరలించి వైద్యసహాయం అందిస్తున్నారు.
ద్విచక్ర వాహనం డికొని మహిళ మృతి.
ఇల్లందు జగదాంబ సెంటర్ నందు నడుచుకుంటూ వెళ్తున్న కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన భుక్యా జ్యోతి (52) నీ ద్విచక్ర వాహనం డికొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన జ్యోతిని స్థానికులు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి ఆమె మరణించారు. కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.