పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి
రేగా విష్ణు మెమోరియల్ ట్రస్టు అధ్వర్యంలో పలువురికి ఆర్ధిక సహాయం
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండల పరిధి లోని బాంబే కాలనీ లోని గోల్డెన్ ఫంక్షన్ హల్ నందు లక్ష్మి నారాయణ,భారతి దంపతుల కుమార్తె,ఓనిలంకరణ, కుమారుని పంచకట్టు వేడుకకు హాజరైన ప్రభుత్వ విప్,రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి,చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.అనంతరం మణుగూరు మండల పరిధి లోని పగిడేరు ఎస్టీ కాలనీ నందు వల్లిపోగుల నగేష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందగా, వారి దశదిన కర్మలకు హాజరై 5000 నగదు ఆర్ధిక సహాయం ను ప్రభుత్వ విప్,రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి,పినపాక నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుద్దంరాజు నవీన్ బాబు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టి మహిళ సీనియర్ నాయకురాలు తాళ్ళపల్లి రజిత,రాణి, బిఅర్ఎస్ పార్టి నాయకులు సిద్దెల తిరుమలరావు,కట్ట రాజు కుమార్,కణతల మహేష్,బోయిళ్ళ రాజు, రాము,అరుణ్,నర్సింహారావు, రాము,గోపి,సాయి కుమార్, రేగ సోషల్ మీడియా వారియర్ గుంటక ప్రవీణ్,డేగల సంపత్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.