- మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు
- త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
- నిధుల మంజూరు పై హర్షం వ్యక్తం చేసిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు
మన్యం న్యూస్ మణుగూరు:
మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కోసం 20 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం పట్ల మణుగూరు జడ్పిటిసి పోశం నర్సింహారావు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో జడ్పిటిసి పోశం నరసింహారావు విలేకరు ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ,2009 లో మణుగూరు మున్సిపాలిటీ లో ఉన్న అన్ని వార్డులకు బస్తీలకు,మంచినీటి సదుపాయం కోసం మున్సిపాలిటీలో మంచినీటి సౌకర్యం కోసం ఇంటింటికి నల్ల ఇవ్వాలని సంకల్పంతో 35 కోట్ల నిధులు మంజూరు చేసి, అందులో 20 కోట్లు నిధులను మంజూరు చేసి,పనులను ప్రారంభించి,ఓవర్ హెడ్ ట్యాంకులు నీటిని శుద్ధి చేసే పనులు పూర్తి చేయడం జరిగింది అన్నారు.మంచినీళ్ల ను శుద్ధి చేసి కొన్ని గ్రామాలకు బస్తీలకు మంచినీళ్లు అందించడం జరిగింది అన్నారు.2014 లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే మంచినీళ్లు ఇవ్వాలని కనీస అవగాహన లేక నిధులు తీసుకురాలేక,ఆ పనులను పూర్తి చేయలేకపోయారు అన్నారు. తద్వారా 2018 వరకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటం జరిగింది అన్నారు.2018 లో మళ్లీ రేగా కాంతారావు గెలిచిన తర్వాత మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న అన్ని బస్తీలకు ఐదు కోట్ల నిధులు మందులు చేయించి వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మణుగూరు మున్సిపాలిటీలను మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరించడం కోసం మంత్రి కేటీఆర్ ద్వారా 20 కోట్ల నిధులు మంజూరు చేయించి మున్సిపాలిటీలోని ప్రతి ఒక్క ఇంటికి శుద్ధి చేసిన నీళ్లను ఇచ్చే విధంగా ప్రత్యేక కృషి చేసినటువంటి సీఎం కెసిఆర్ కు,మంత్రి కేటీఆర్ కు,ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు కు మణుగూరు మున్సిపాలిటీ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మణుగూరు మున్సిపాలిటీ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే చూసి చూడనట్టుగా వ్యవహరించిన ఈ నాయకులకు మణుగూరు మున్సిపాలిటీ ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్పాలని, ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు, బిఆర్ఎస్ పార్టీకి ప్రజల పూర్తి మద్దతు ఇవ్వాలని మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు కోరారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,కార్యదర్శి నవీన్, ఉపాధ్యక్షులు షేక్ బాబ్ జాని, రైతు సమితి అధ్యక్షులు రామసాని వెంకటరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వట్టం రాంబాబు,ఈరెల్లి అచ్చయ్య,మణుగూరు టౌన్ యూత వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం సృజన్,మహిళ అధ్యక్షురాలు తుంగల చంద్రకళ,యూత్ నాయకులు బోయిళ్ల.రాజు,బర్ల.సురేష్,సోషల్ మీడియా వారియర్స్ గుంటక ఏశావ్,డేగల సంపత్ తదితరులు పాల్గొన్నారు.