గణపతులకు ఘనంగా వీడ్కోలు
* పాల్గొన్న ఎమ్మెల్యే వనమా
* ఇతర పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు దిగ్విజయంగా పూజలు అందుకున్న గణపతులకు గురువారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య.. అంటూ భక్తులు గణపయ్యలను భద్రాచలం గోదావరి గంగమ్మ ఒడికి చేర్చారు. డ్యాన్సులు చేస్తూ, భక్తులకు
ప్రసాదాలు పంచుతూ గణనాథులను సంతోషంగా సాగనంపారు. ఈ క్రమంలో బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలుకుతూ వచ్చే ఏడాది మళ్లీ రావాలంటూ భక్తులు
పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు
పడాలని తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోయేలా దీవించాలని ఆ లంబోదరుడిని కోరుకున్నారు.
వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..
బొజ్జ గణపయ్యల వీడ్కోల కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో భద్రాచలం గోదావరి నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులకు పూజలు చేసి జెండా ఊపి శోభాయాత్రను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలో రాజకీయ నాయకులతోపాటు వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఎంపీపీ బాధావత్ శాంతి, నాయకులు కాసుల వెంకట్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, గణేష్ టెంపుల్ గుడి చైర్మన్ తాటిపల్లి శంకర్ బాబు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు , మహిళా నాయకురాలు, కార్యకర్తలు, శోభయాత్ర కమిటీ అధ్యక్షులు, సభ్యులు, పూజారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.