రేగాను ఘనంగా సత్కరించిన నెల్లిపాక బంజర గ్రామపంచాయతీ రైతులు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం
మన్యం న్యూస్ ,అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుని అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామానికి చెందిన పలువురు రైతులు మర్యాదపూర్వకంగా కలిసి, ఈ సందర్భంగా గ్రామానికి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ గొర్రె ముచ్చు రమణ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా మా గ్రామ పంచాయతీని రేగా కాంతారావు చొరవతోఅభివృద్ధి చేసుకుంటున్నామని,గత పాలకులకు మా పంచాయతీ గోడు వినిపించలేదని వారు తెలియజేశారు.వచ్చే ఎన్నికలలో రేగా కాంతారావుని భారీ మెజారిటీతో గెలిపించుకొని మా గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకుంటామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున్ రావు, నెల్లిపాక బంజారా గ్రామపంచాయతీ సర్పంచ్ గోర్రముచ్చు వెంకటరమణ, రైతులు బెల్లం వెంకటేశ్వర్లు, మండ్రు వరప్రసాద్, సూర్యనారాయణ, చావా మహేశ్వరరావు, చిలకల రాములు, పోకల కృష్ణార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.