మన్యం న్యూస్ చర్ల:
ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నెంబర్ 03ను చట్టం చేసి ఆదివాసిలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ చర్ల నుండి భద్రాచలం వరకు ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి హేమ సుందర్ ఆధ్వర్యంలో ఆదివాసి సంఘాలు బైక్ ర్యాలీని నిర్వహించాయి. ఈ సందర్భంగా కొర్శ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 1182 రెవెన్యూ గ్రామాలు ఉన్న ఐదవ షెడ్యూల్ భూ భాగాన్ని ఆదివాసీ హక్కుల కోసం ఏర్పడ్డ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం జీవో నెంబర్ 03ను ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు గిరిజన సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలనే అప్పటి ప్రభుత్వాలు జీవో నెంబర్ 3 ను తీసుకురావడం జరిగిందన్నారు. కానీ కొంతమంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో అప్పీల్ వల్ల ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏజెన్సీలో జీవన్ నెంబర్ 3 చట్టం చేసి ఆదివాసీలకు వందశాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఏజెన్సీలో ప్రభుత్వం ఆదివాసీలను దృష్టిలో ఉంచుకొని వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచాలనే ఉద్దేశంతో ఇసుక సొసైటీలను ఏర్పాటు చేయటం జరిగిందని కానీ కొంతమంది గిరిజనేతరులు రేసింగ్ కాంట్రాక్టర్ల రూపంలో గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.కావున ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 3 నీ ఏజెన్సీ ప్రాంతంలో పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసుల అభివృద్ధికి దోహదపడాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏ ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాసరావు, ఏటిఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు జయ బాబు, ఏవీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నూప నాగేశ్వరరావు,సొందే మల్లు దొర, ఏవీఎస్పీ మండల అధ్యక్షులు మోడెమ్ జయరాం, శ్యామల రామారావు ,తోకల లక్ష్మీపతి, వల్లే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.